News16th Jun 12:49 PMSunil Byrisetty1 min read

బారా షహీద్ దర్గా అభివృద్ధికి రూ.5 కోట్లు

నెల్లూరు బారా షహీద్ దర్గాలో 25 వేల మంది ప్రార్థనలు చేసేలా మందిరాన్ని నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. దర్గా అభివృద్ధికి సీఎం చంద్రబాబు 5 కోట్ల నిధులు మంజూరు చేశారని...

బారా షహీద్ దర్గా అభివృద్ధికి రూ.5 కోట్లు
నెల్లూరు బారా షహీద్ దర్గాలో 25 వేల మంది ప్రార్థనలు చేసేలా మందిరాన్ని నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. దర్గా అభివృద్ధికి సీఎం చంద్రబాబు 5 కోట్ల నిధులు మంజూరు చేశారని... ఈ నిధులతో వీలైనంత త్వరగా ప్రార్థన మందిరాన్ని నిర్మిస్తామన్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లపై నెల్లూరు కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొట్టెల పండగకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దర్గా అభివృద్ధికి సీఎం నిధుల విడుదల చేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
Minister Ponguru Narayana
Nellore
Bara shaheed dargah
Rs.5 crore for the Dargah’s development
Roti festival
బారా షహీద్ దర్గా అభివృద్ధికి రూ.5 కోట్లు
రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్ష
Scroll for the next article