News6th May 12:43 PMSunil Byrisetty1 min read

‘తల్లికి వందనం' పై తాజా నిర్ణయం!

పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు ఇచ్చే నగదు ప్రోత్సాహం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై స్పష్టత ఇచ్చారు. కాగా, ఇకే విడతలోనే అమల

‘తల్లికి వందనం' పై తాజా నిర్ణయం!
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు ఇచ్చే నగదు ప్రోత్సాహం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై స్పష్టత ఇచ్చారు. కాగా, ఇకే విడతలోనే అమలు చేస్తారా.. రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది. ఇక.. దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. తాజాగా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. 2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. \ 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. పథకం అమల్లో భాగంగా విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.
Andhra pradesh
cm chandra babu
thalli ki vandanam Scheme
తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఒక అంచనా
విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన
69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులు
2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపు
Scroll for the next article