News23rd Jul 01:14 PMSunil Byrisetty1 min read
నూతనంగా ఆలోచిస్తే కొత్త ఆవిష్కరణలు
ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, సంక్షోభాలనూ అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని వివరించారు
ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, సంక్షోభాలనూ అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయన్నారు. యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులేనని వివరించారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమన్నారు. విజన్ 2020తో రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచామని, వికసిత్ భారత్ ద్వారా 2047 ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని వివరించారు. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటవుతుందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామన్నారు.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు.