News28th Oct 11:07 AMSunil Byrisetty1 min read

ఏపీలో ఐకానిక్ రైల్వే స్టేషన్లు

దేశంలోనే కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ, విశాఖ పోర్టులతో

ఏపీలో ఐకానిక్ రైల్వే స్టేషన్లు
దేశంలోనే కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ, విశాఖ పోర్టులతో పాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, రామాయపట్నం వంటి పోర్టులకు తప్పనిసరిగా రైల్వే అనుసంధానం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేందుకు, లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైలు రవాణా కారిడార్లే కీలకమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై మార్గాల్లో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Andhra Pradesh
Railway Development
Chandrababu Naidu
Logistics Hub
High Speed Rail
Bullet Train
Infrastructure
Kakinada Port
Visakhapatnam Port
రామాయపట్నం పోర్టు
మూలపేట పోర్టు
అమరావతి
ఇండియన్ రైల్వేస్
రవాణా అభివృద్ధి
Scroll for the next article