News24th Mar 01:13 PMSunil Byrisetty1 min read
పంటనష్టంతో రైతుల ఆత్మహత్యాయత్నం.. సీఎం చంద్రబాబు ఆరా
అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నా
అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
అకాల, వడగండ్ల వానతో పంట నష్టపోయి ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఇద్దరు రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం తప్పిందని.. అధికారులు వివరించారు.
మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటనష్ట జరిగిందని అధికారులు వివరించారు.
మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు.
అకాల వర్షాలు, వడగండ్ల వానవల్ల జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని అధికారులు సిఎంకు వివరించారు.
వారికి ప్రభుత్వ పరంగా సాయం అధించాలని అధికారులకు సీఎం సూచించారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.