Politics20th Mar 10:48 AMSunil Byrisetty1 min read

చంద్రబాబు మార్క్.. కీలక రంగాలకు సలహాదారులు!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల పేరుతో ఎంతోమందిని నియమించి, ప్రజల సొమ్మును వేతనాలుగా చెల్లించారు. ఈ విషయంపై ప్రజలతోపాటు కూటమి నేతలూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూటమి ప్

చంద్రబాబు మార్క్.. కీలక రంగాలకు సలహాదారులు!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల పేరుతో ఎంతోమందిని నియమించి, ప్రజల సొమ్మును వేతనాలుగా చెల్లించారు. ఈ విషయంపై ప్రజలతోపాటు కూటమి నేతలూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సలహాదారుల నియామకం చేపడుతోంది. అయితే అందులో చంద్రబాబు మార్క్ కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలక రంగాల అభివృద్ధికి తోడ్పడేలా ఆయా రంగాల దిగ్గజాలను సలహాదారులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమించింది. తద్వారా స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో స్పేస్ టెక్నాలజీని అనుసంధానించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆయన అనుభవం ఎంతో తోడ్పడుతుంది. డీఆర్డీవో మాజీ చీఫ్ సతీష్ రెడ్డిని ప్రభుత్వ గౌరవ సలహాదారు నియమించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫేక్చరింగ్ హబ్ అభివృద్ధిలో ఆయన నైపుణ్యాలు ఉపయోగపడనున్నాయి. కేబినెట్ హోదాతో రెండేళ్లపాటు ఆ పదవి ఉంటుంది. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేవీపీ గాంధీ నియామకం. రాష్ట్రంలో నేర పరిశోధనలకు ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడనుంది. దీంతో ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో కావాల్సిన వారందరినీ సలహాదారులుగా నియమిస్తే, కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో సహకరించే దిగ్గజాలను ఏరికోరి నియమించిందని చర్చించుకుంటున్నారు.
Advisors
Andhra Pradesh
Somnath
Satish Reddy
ఎండీ సుచిత్ర ఎల్లాను
Scroll for the next article