News11th Jun 04:27 PMSunil Byrisetty1 min read
సూపర్ సిక్స్‌లో మరో పథకానికి గ్రీన్ సిగ్నల్
సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధుల విడుదలకు నిర
సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుది. అందుకోసం తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనున్నారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నారు. విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీ.వో విడుదల చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.