News27th Jul 10:36 AMSunil Byrisetty1 min read
సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు సంప్రదాయ వస్త్రధారణలో హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ హాజరు కానున్నారు.