News13th Nov 01:01 PMSunil Byrisetty1 min read

ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం

ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అమెరికా వెలుపల గూగుల్ అత

ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం
ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందన్నారు. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందని, గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించామని పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని, దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని, దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నామన్నారు. స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Chandrababu Naidu
India-Europe Business Partnership
Visakhapatnam
Andhra Pradesh
Google AI Data Center
Quantum Valley
Amaravati
పరిశ్రమల అభివృద్ధి
పెట్టుబడులు
నూతన ఆవిష్కరణలు
Scroll for the next article