News19th Oct 09:13 AMSunil Byrisetty1 min read
ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక
దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుక అందించింది. నవంబరు 1 నుంచి పెంచిన డీఏ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో
దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుక అందించింది. నవంబరు 1 నుంచి పెంచిన డీఏ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీనికి ప్రతీ నెలా రూ.160 కోట్ల వ్యయం అవుతుందని సీఎం వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ "పోలీసులకు సరెండర్ లీవుల్లో ఒక ఇంస్టాల్ మెంట్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం. ఈ ఏడాది నవంబరులో ఒక విడత, 2026 జనవరిలో మరో విడతను చెల్లిస్తాం. 1 సరెండర్ లీవ్ చెల్లింపుల నిమిత్తం రూ.210 కోట్లు వ్యయం అవుతుంది. ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. దీన్ని 60 రోజుల్లోగా పూర్తి చేసేలా కెబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తాం. ఉద్యోగుల అందరి గౌరవాన్ని మరింత పెంచేలా కొన్ని నామన్ క్లేచర్లను రీ డెజిగ్నేట్ చేస్తాం". అని స్పష్టం చేశారు.