News5th Sep 03:11 PMSunil Byrisetty1 min read

ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు నిర్ణయాలు

ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి నిర్ణయాలు వెలువరించారు. సీఎం ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 12వ PR

ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు నిర్ణయాలు
ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి నిర్ణయాలు వెలువరించారు. సీఎం ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 12వ PRC నియామకానికి అంగీకారం తెలపడంతోపాటు రెండు డిఎలు అక్టోబర్ 1 నుంచి చెల్లిస్తామని చెప్పారు. 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకారం తెలిపారు. పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లిస్తామన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు కానుంది.
Andhra Pradesh
Employees
Employee Unions
12th PRC
Pay Revision Commission
DA Arrears
Dearness Allowance
Surrender Leave
Police Employees
అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్
ఈహెచ్ఎస్
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉద్యోగుల సమస్యలు
Scroll for the next article