Politics18th Aug 05:45 PMSunil Byrisetty1 min read

3 చారిత్రక నిర్ణయాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు అనుకూలంగా మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వారి సామాజిక రాజకీయ అభ

3 చారిత్రక నిర్ణయాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు అనుకూలంగా మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వారి సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసం మూడు ప్రధానమైన అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఆయారాం గయారాం కాకుండా సుస్థిరమైన పాలన అందించేలా ఇది దోహద పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మూడో నిర్ణయం వెల్లడించారు.
Andhra Pradesh
34 Percent Reservation
Chandrababu Naidu
BC Reservations
Local Body Elections
Rural Local Bodies
మేయర్ ఎన్నికలు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు
జిల్లా ప్రజాపరిషత్‌లు
Scroll for the next article