Education24th Jul 01:52 PMSunil Byrisetty1 min read
మెగా పీటీఎం-4.0లో సీఎం చంద్రబాబు
రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-4.0కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్
రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-4.0కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నగా సభ యాంకర్లుగా పాఠశాల విద్యార్థులు వ్యవహరించారు. మా తెలుగుతల్లి గీతాలాపనతో సభ ప్రారంభం కాగా.. ప్రధానోపాధ్యాయుని ప్రగతి నివేదికను రంపచోడవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చదివి వినిపించారు. సభలో తల్లుల పాదాలకు మొక్కి విద్యార్థులు ఆశీర్వాదం తీసుకున్నారు. అదే సమయంలో వేదిక మీదున్న సీఎం చంద్రబాబు కాళ్లకు మంత్రి నారా లోకేష్ నమస్కరించగా ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.