News24th Sep 03:50 PMSunil Byrisetty1 min read
మంత్రి నిమ్మల కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపా
మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కల్యాణవేదికకు వచ్చి నూతన వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.