News31st Oct 11:21 AMSunil Byrisetty1 min read
నారా రోహిత్ వివాహానికి చంద్రబాబు కుటుంబం
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేడుకకు సీఎం చంద్రబాబు కుటుంబంతో సహా హాజరై ఆశీర్వదించారు. అలాగే సోదరుడ
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేడుకకు సీఎం చంద్రబాబు కుటుంబంతో సహా హాజరై ఆశీర్వదించారు. అలాగే సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హైదరాబాద్ అజీజ్ నగర్ లోని ద వెన్యూ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నారా రోహిత్, శిరీషలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.