Politics26th Jul 12:24 PMSunil Byrisetty1 min read

రెండేళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో గడచిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజ

రెండేళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో గడచిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని చెప్పారు. సీట్లల్లో 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించగలిగామని వివరించారు. నాటి ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసం వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేపడుతున్నామని.. అదే విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలని, టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh
N Chandrababu Naidu
TDP
NDA Alliance
Coalition Government
Door to Door Campaign
Local Body Elections
టెలీ కాన్ఫరెన్స్
పార్టీ సమావేశం
ఏపీ రాజకీయాలు
ప్రభుత్వ విజయాలు
Scroll for the next article