News14th Jul 03:08 PMSunil Byrisetty1 min read
బిజినెస్ రూల్స్‌లో సంస్కరణలు
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిట
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దేవాదాయ, రహదారులు భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా,అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న వివిధ సేవలు, ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న సంతృప్త స్థాయిపై సీఎం సూచనలు జారీ చేశారు. ప్రోయాక్టివ్ గవర్నెన్సు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందిస్తేనే చిట్టచివరి వ్యక్తి వరకూ పాలనా ఫలితాలు అందుతాయని అన్నారు.