News29th Oct 12:04 PMSunil Byrisetty1 min read
సీఎం అధ్యక్షతన వర్చువల్ గా మంత్రివర్గ సమావేశం
సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వర్చువల్ గా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్గం ముందుకు 45కు పైగా అజెండా అంశాలు వచ్చాయి. కేబినెట్ ముందుకు సచివాలయ టవర్ల నిర్మాణానికి రూ.1,92
సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వర్చువల్ గా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్గం ముందుకు 45కు పైగా అజెండా అంశాలు వచ్చాయి. కేబినెట్ ముందుకు సచివాలయ టవర్ల నిర్మాణానికి రూ.1,925 కోట్ల టెండర్ల ప్రతిపాదనపై చర్చ జరిగింది. విశాఖలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు భూకేటాయింపుపై మంత్రివర్గంలో చర్చించారు. విజయనగరంలో రూ.5,194 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో హార్డ్‌వేర్ తయారీ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే రక్షణ పరిశ్రమల క్లస్టర్లు.. వివిధ జిల్లాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, కృష్ణా జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు.. లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.698.90 కోట్ల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. తుపాను పరిస్థితులపై నివేదికతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.