News22nd Nov 11:57 AMSunil Byrisetty1 min read

పీపీపీ విధానంపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలు ప్రభుత్వ నియంత్రణలోనేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామీణ పేదలకు ఉచిత వైద్యమే లక్ష్యమన్నారు. కుప్పంలో 'సంజీవని' ప్రాజెక్టు.. ఆరోగ్

పీపీపీ విధానంపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలు ప్రభుత్వ నియంత్రణలోనేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామీణ పేదలకు ఉచిత వైద్యమే లక్ష్యమన్నారు. కుప్పంలో 'సంజీవని' ప్రాజెక్టు.. ఆరోగ్య రంగంలో గేమ్ ఛేంజర్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న వైద్య కళాశాలలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోనే ఉంటాయని తేల్చి చెప్పారు. అవి పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కళాశాలల ఏర్పాటు విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు.
Andhra Pradesh
Chandrababu Naidu
PPP Policy
Medical Colleges
Healthcare
సంజీవని ప్రాజెక్టు
గ్రామీణ ఆరోగ్యం
ప్రభుత్వ నియంత్రణ
ఏపీ వార్తలు
Scroll for the next article