Politics9th Mar 06:06 PMSunil Byrisetty1 min read

అమ్మ కష్టం ఎవరూ పడకూడదనే దీపం 2

తన తల్లి పడిన కష్టం ఏ తల్లీ పడకూడదనే ఉచిత గ్యాస్ పథకం తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బాల్యంలో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చంద్రగిరిలో చదువుకునే వాడినన్నారు. ఆ రోజులల

అమ్మ కష్టం ఎవరూ పడకూడదనే దీపం 2
తన తల్లి పడిన కష్టం ఏ తల్లీ పడకూడదనే ఉచిత గ్యాస్ పథకం తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బాల్యంలో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చంద్రగిరిలో చదువుకునే వాడినన్నారు. ఆ రోజులలో తన తల్లి తెల్లవారుజామునే లేచి వంట చేసి క్యారేజీ కట్టిచ్చేవారని గుర్తు చేసుకున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేయడంతో తన తల్లి కళ్ళలో నీళ్ళు తిరిగేవని భావోద్వేగానికి గురయ్యారు. అందుకే తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే దీపం పథకం తీసుకువచ్చానని చెప్పారు. ఏ ఆడబిడ్డ కూడా తన తల్లి పడ్డ కష్టం పడకూడదని ఆలోచించానని అన్నారు. అయితే గ్యాస్ ధర పెరిగిందని కొందరు గ్యాస్ వాడటం ఆపేసారని, అందుకే దీపం 2.0 తీసుకువచ్చి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నానని చెప్పారు.
CM Chandrababu
Free gas Cylinder
TDP Party
సీఎం చంద్రబాబు
ఉచిత గ్యాస్ సిలిండర్
టీడీపీ పార్టీ
Scroll for the next article