News21st May 09:34 AMSunil Byrisetty1 min read
లిక్కర్ స్కాంపై కీప్ సైలెన్స్!
మద్యం కుంభకోణంపై ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాం ప్రస్
మద్యం కుంభకోణంపై ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రివర్గ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా లిక్కర్ స్కాం ప్రస్తావన రాగా.. దర్యాప్తు సంస్థలు స్కాంపై దర్యాప్తు చేస్తున్నాయన్నారు.
ఈ విషయంలో రాజకీయ వ్యాఖ్యానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని.. ఆ బృందంలోని సభ్యలు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు.
ఈ క్రమంలో .. రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా వైసీపీ మాట్లాడుతోందన్నారు. టీడీపీ నేతలు స్పందిస్తే.. వారు అదే అభిప్రాయాన్ని కల్పిస్తారన్నారు.
అందుకే పార్టీ నేతలు, మంత్రులు ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ ఎవరు అన్నదానిపై ఇప్పటికే సాక్ష్యాల సేకరణ పూర్తయిందని, సరైన సమయం చూసి.. అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో కౌంటర్లు ప్రారంభించారు.
కానీ పోలీసులు తమ పని తాము చేసుకుపోతారని.. ప్రభుత్వం చెబుతోంది.