News1st Oct 04:28 PMSunil Byrisetty1 min read

కొండపల్లికి సీఎం కీలక ఆదేశాలు

దత్తీ గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో కీలక ప్రకటన చేశారు. వెనుకబడిన విజయనగరం జిల్లాను, ముఖ్యంగా గజపతినగరం నియోజకవర్గంను అభివృద్ధ

కొండపల్లికి సీఎం కీలక ఆదేశాలు
దత్తీ గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో కీలక ప్రకటన చేశారు. వెనుకబడిన విజయనగరం జిల్లాను, ముఖ్యంగా గజపతినగరం నియోజకవర్గంను అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అప్పజెప్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆదేశించారు. జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు స్పష్టమైంది.
Andhra Pradesh Politics
Pension Distribution
Kondapalli
Chief Minister
Chandrababu Naidu
Vijayanagaram District
Gazapathinagaram Constituency
Minister Srinivas
పెన్షన్ పంపిణీ
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
Scroll for the next article