News29th Oct 03:46 PMSunil Byrisetty1 min read

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లారు. అమరావతి నుంచి కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్నారు. మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా అర్నబ

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లారు. అమరావతి నుంచి కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్నారు. మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లను ఏరియల్ వ్యూలో పరిశీలన జరిపారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలను సీఎంకు సెక్రటరీ ప్రద్యుమ్న వివరించారు.
Scroll for the next article