News9th Apr 09:48 AMSunil Byrisetty1 min read
11న ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు
దక్షిణ భారత అయోధ్యగా పేరు గాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11న సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ కల
దక్షిణ భారత అయోధ్యగా పేరు గాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ నెల 11న సీతారాముల కల్యాణం జరగనుంది.
ఈ కల్యాణానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
11న సాయంత్రం 5 గంటలకు సీఎం ఒంటిమిట్టకు చేరుకుని, స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
అదేరోజు రాత్రి ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలోనే సీఎం బస చేస్తారు.
ఈనెల 15 వరకూ జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇటీవల ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేశారు.
భక్తుల కోసం ఆలయం లోపల చలువ పందిళ్లు వేశారు.
ఈనెల 11న రాములోరి కల్యాణం జరగనుండగా, ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.