News24th May 12:31 PMSunil Byrisetty1 min read
ఢిల్లీలో బాబు బిజీ బిజీ.. అమరావతిపై!!
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఆయన శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. విభజన చట్టాన్ని సవరిం
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు.
శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఆయన శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు.
విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని తెలిపారు.
లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తామని, రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కోరామన్నారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభిస్తామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పదేళ్ల సమయం పడుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణ హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. గత పాలకులు రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఏడుగురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఆర్థికసాయంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.