News30th Sep 12:42 PMSunil Byrisetty1 min read
ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, లోకేశ్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారయింది. వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వారు కేంద్ర నేతలతో కీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారయింది. వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వారు కేంద్ర నేతలతో కీలక భేటీ కానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక మద్దతు, ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు.