News10th Sep 05:20 PMSunil Byrisetty1 min read

ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణ జాబితాను సిద్ధం చేయండి

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై పరిమిత సమయం పెట

ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణ జాబితాను సిద్ధం చేయండి
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై పరిమిత సమయం పెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి 10 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చించారు. ప్రస్తుతం 1.43 లక్షల మందిని ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వచ్చే నెల 15వ తేదీ నాటికి వాటి పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 1,692 గ్రామాల్లో 18 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎంతమందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి.. ఎంతమందికి పట్టాలను క్రమబద్ధీకరించాలనే అంశాలపై స్పష్టమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.
AP Government
Chandrababu Naidu
House Site Pattas
Housing Pattas
Andhra Pradesh Housing
Housing for Poor
House Site Regularisation
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ
ఏపీ ప్రభుత్వం
జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్
అమరావతి
గృహ నిర్మాణాలు
లబ్ధిదారుల జాబితా
Scroll for the next article