News9th Aug 09:44 AMSunil Byrisetty1 min read

పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు

వర్షాభావ పరిస్థితుల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పశువులకు అవసరమైన మేత, నీటి లభ్యతను నిర్ధారించడంతో పాటు అవసరమైన చోట్ల గోక

పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు
వర్షాభావ పరిస్థితుల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పశువులకు అవసరమైన మేత, నీటి లభ్యతను నిర్ధారించడంతో పాటు అవసరమైన చోట్ల గోకులాలను సిద్ధం చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. నీటి వనరుల సంరక్షణ అనేది నిత్యం జరగాలని చెప్పారు. వివిధ కారణాల వల్ల చాలా కాలంగా నీటి లభ్యత లేని చెరువులు, కాల్వలను గుర్తించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మైక్రో బేసిన్‌ అనుసంధాన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Fodder Shortage
Livestock
Drought Conditions
Gokulams
Water Resources
పశుసంవర్ధక శాఖ
ఏపీ ప్రభుత్వం
సాగునీరు
నీటి సంరక్షణ
మైక్రో బేసిన్ అనుసంధానం
Scroll for the next article