News29th Oct 10:39 AMSunil Byrisetty1 min read
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి
అర్నబ్ తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాలు మినహా మిగ
అర్నబ్ తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, పునరుద్ధరణ పనులపై అధికారులు, కలెక్టర్లతో సీఎం సమీక్షించారు. తుపాను నష్టంపై ఇవాళ ప్రాథమిక నివేదికను అందిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. బాధితులందరికీ పరిహారం అందించే పనిని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.