News26th Sep 04:50 PMSunil Byrisetty1 min read
లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు
పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. మనకు రోడ్డు రవాణాలో 41 శాతం జరుగుతోందని, వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం చాలా ప్రయోజన
పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. మనకు రోడ్డు రవాణాలో 41 శాతం జరుగుతోందని, వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం చాలా ప్రయోజనమని వివరించారు. ప్రస్తుతం రోడ్లు, రైళ్లు, విమానాలు, జలాలు, పైప్‌లైన్ ద్వారా రవాణా.. పైప్‌లైన్ ద్వారా రవాణా చేస్తే కాలుష్యం కూడా ఉండదని పేర్కొన్నారు. లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, మౌలిక వసతులు, విద్యుదుత్పత్తి, పరిశ్రమలకు ప్రత్యేక మ్యాప్ తయారుచేశామని చెప్పారు. పోర్టులు-హార్బర్ల మధ్య రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించామని.. మా ప్రభుత్వంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడబోమని వివరించారు.రోడ్ల నిర్మాణ పనులను తరచుగా చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.