News19th Oct 03:50 PMSunil Byrisetty1 min read
పెట్టుబడులే కాదు పాలసీ మేకింగ్‌పైనా చర్చ
ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్‌పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం
ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్‌పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో దావోస్ తరహాలోనే పెట్టుబడిదారులు, పాలసీమేకర్ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడులు, ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం కూడా ప్లీనరీ సెషన్లు, బ్రేకవుట్ సెషన్లు నిర్వహించాలని సూచించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్లలో విధానాలపై మేధోమథనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.