Politics1st Nov 11:27 AMSunil Byrisetty1 min read
ఇద్దరు నేతలపై చంద్రబాబు సీరియస్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు,
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారని, అలాంటివాళ్లు నిరభ్యంతరంగా బయటికి వెళ్లి పోటీ చేయొచ్చు అంటూ పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. సిద్ధాంతాలపై అవగాహన లేనివారికి టికెట్లిస్తే తిరువూరులాంటి పరిస్థితులే ఎదురవుతాయన్నారు. పార్టీ అండ లేకపోతే వారి పరిస్థితేంటో అప్పుడు అర్థమవుతుందని చెప్పారు. క్రమశిక్షణా కమిటీ వీరి వ్యవహారంపై పరిశీలించి, మాట్లాడాలని సూచించారు. లండన్ పర్యటన తర్వాత నివేదిక ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు.