News18th Aug 04:45 PMSunil Byrisetty1 min read

డ్రోన్ సిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

సీఎం చంద్రబాబు విజన్‌తో డ్రోన్ కంపెనీలు ముందుకొస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లులో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటవుతోందని, దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ అ

డ్రోన్ సిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
సీఎం చంద్రబాబు విజన్‌తో డ్రోన్ కంపెనీలు ముందుకొస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లులో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటవుతోందని, దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ అని తెలిపారు. రెండేళ్లలోనే ఏపీలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. డ్రోన్ల తయారీ, ప్రొడక్షన్, శిక్షణ అన్నీ ఉంటాయని, కంపెనీలకు ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. డ్రోన్ శక్తిని వాటి పనితీరును ప్రధాని మోదీ గుర్తించారన్నారు. మన టెక్నాలజీతో చేసిన డ్రోన్లు ఎగుమతి చేయాలని మోదీ సంకల్పించారని, అందుకే విదేశాల నుంచి డ్రోన్ల దిగుమతిని నిషేధించారని చెప్పారు.
Andhra Pradesh
Drone Technology
Drone Manufacturing
Drone City
Chandrababu Naidu
Rammohan Naidu
Orvakal
పెట్టుబడులు
ప్రధాని మోదీ
డ్రోన్ ఎగుమతులు
పారిశ్రామిక అభివృద్ధి
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
Scroll for the next article