News6th May 03:01 PMSunil Byrisetty1 min read
పర్యాటక రంగంలో 20% వృద్ధి లక్ష్యంగా అడుగులు
పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటక రంగం మరింత
పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
సీఎం సలహాలు సూచనల మేరకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.
ప్రత్యేకించి టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, 150 అరకు కాఫీ స్టాల్స్, ఎక్స్ పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి డీపీఆర్ లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
విభిన్న పర్యాటక ప్రక్రియలను ప్రవేశపెట్టి పర్యాటకుడికి మధురానుభూతి కల్పిస్తామన్నారు.
వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లి పర్యాటక ప్రగతి సాధిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.