News7th Aug 04:59 PMSunil Byrisetty1 min read

90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం

90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. చీరాలలో సీఎంను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు కలిశారు. సామాజిక మాధ్యమాల్లో

90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం
90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. చీరాలలో సీఎంను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు కలిశారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబును కలిసి ఫోటో దిగాలని వృద్ధురాలు పోస్ట్ చేశారు. ఈ విషయం తన దృష్టికి రావటంతో చీరాలలో కలిసి మాట్లాడతానంటూ ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు. ఈ మేరకు చీరాలలో ఆ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. మగ్గంతో వస్త్రంపై తన చిత్రపటాన్ని నేసిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మీలతో సీఎం మాట్లాడారు. ఎంతో నైపుణ్యంతో తన చిత్రపటాన్ని వస్త్రంపై నేసిన చేనేత దంపతులకు అభినందనలు తెలియజేశారు.
Andhra Pradesh
Handloom Weavers
N. Chandrababu Naidu
Chirala
90 ఏళ్ల వృద్ధురాలు
ఎచ్చెర్ల
శ్రీకాకుళం
నాగేశ్వరరావు
లక్ష్మీ
సోషల్ మీడియా
నేతన్న సేవలో
Scroll for the next article