Politics7th Sep 05:24 PMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ లీడర్ షిప్ కాంక్లేవ్ లో భాగంగా టీడీపీ నేతలతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని సూచి
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ లీడర్ షిప్ కాంక్లేవ్ లో భాగంగా టీడీపీ నేతలతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. పార్టీలోని నేతల మధ్య ఎలాంటి గ్యాప్‌లు ఉండకూడదన్నారు. మహిళా రిజర్వేషన్లలో పోటీచేసే వారిలో.. సమర్థవంతమైన మహిళా నేతలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నామని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.