News3rd Nov 05:13 PMSunil Byrisetty1 min read
లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో ముఖ్యమంత్రి
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. లండన్ లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ పేరు పొందింది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు.విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.