Politics1st Nov 03:33 PMSunil Byrisetty1 min read
ముఖ్యనేతలు.. కేడర్‌తో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు.. పోలింగ్ సరళిపై నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయన్నార
స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు.. పోలింగ్ సరళిపై నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. గతంలో జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇంతటి స్పూర్తి కన్పించలేదని చెప్పారు. కొన్ని మున్సిపాల్టీల్లో ప్రజలు ఓట్లు వేసేందుకు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తక్కువ పోలింగ్ నమోదైందని అన్నారు. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని, కొంత మంది వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోవచ్చని పేర్కొన్నారు. అలాంటి వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా సమన్వయం చేసుకోవాలని, ఎన్నికల నిబంధనలను పాటిస్తూనే పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా కుట్ర కోణంలో వ్యవహరిస్తారు.. కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని సీఎం అన్నారు.