News1st Aug 12:09 PMSunil Byrisetty1 min read

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు నెలలో అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ చేశారు. పథకాల అమలు గురించి

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు నెలలో అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ చేశారు. పథకాల అమలు గురించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర సాయంతో కలిపి రైతుల ఖాతాల్లో రూ.20 వేలు.. కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతోనే నష్ట పోయామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులనూ భర్తీ చేస్తామని వివరించారు. తనకు పార్టీ కార్యకర్తలే ముఖ్యమని, కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu Naidu
CM Teleconference
Annadata Sukhibhava
Free Bus Travel for Women
Welfare Schemes
TDP
Farmers Welfare
Government Initiatives
టెలికాన్ఫరెన్స్
అన్నదాత సుఖీభవ
ఉచిత బస్సు ప్రయాణం
Scroll for the next article