News24th Sep 01:26 PMSunil Byrisetty1 min read

వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్

వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని అంచనా ఉందన్నారు. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూ

వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్
వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని అంచనా ఉందన్నారు. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. కొండచరియలు విరిగిపడే చోట.. ప్రజలను అప్రమత్తం చేయండని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని, కంట్రోల్ రూమ్‌ల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలనూ సేకరించాలని సూచనలు చేశారు. వరద ప్రభావానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Scroll for the next article