News31st Jan 11:53 AMSunil Byrisetty1 min read

కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కుప్పం మున్సిపాల్టీ పరిధిలో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నవదిశ కేంద్రం పేరిట కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ఏర్పాటైంది. హిందాల్కో-ఆదిత్య బిర్లా గ్రూ

కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కుప్పం మున్సిపాల్టీ పరిధిలో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నవదిశ కేంద్రం పేరిట కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ఏర్పాటైంది. హిందాల్కో-ఆదిత్య బిర్లా గ్రూప్-కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టీ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం ద్వారా 2500 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. 20 వేల మంది యువతకు నైపుణ్యం, సాధికారత లభించేలా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కృషి చేయనుంది. హైస్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పని చేసుకునేలా కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ రూపకల్పన చేశారు. అదనంగా 40 మంది చదువుకునేలా లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వచ్చే మూడేళ్ల్లల్లో 1000 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేలా చర్యలు, 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రచించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Kuppam
Co-Working Space
Navadisha Kendra
Skill Development
Multi Skill Development Centre
హిందాల్కో
యువత ఉపాధి
డిజిటల్ లైబ్రరీ
మౌలిక వసతుల అభివృద్ధి
Scroll for the next article