News11th Nov 10:02 AMSunil Byrisetty1 min read
50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించనున్న సీఎం
రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 50 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కులకు సీఎం చంద్రబాబు ప్రారంభం చేయనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంల
రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 50 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కులకు సీఎం చంద్రబాబు ప్రారంభం చేయనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడు నుంచి ఆయన వర్చువల్ విధానంలో ఈ పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టుబడులతో ఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా రెండో దశ కింద 329 ఎకరాల్లో రూ.134 కోట్ల వ్యయంతో సిద్ధమైన 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 587 ఎకరాల్లో కొత్తగా నిర్మించనున్న 32 ప్రభుత్వ, 3 ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు.