News9th Jun 06:25 PMSunil Byrisetty1 min read

స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలుకు మరింత ఊతం

‘ జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్‌ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ

స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలుకు మరింత ఊతం
‘ జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్‌ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని...ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్ కూడా ఇస్తున్నామని... ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒకమంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సూచించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Andhra Pradesh news
cm chandra babu
swarnandhra
vision 2047
amaravati galam
స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలు
175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు
Scroll for the next article