News20th Jul 02:56 PMSunil Byrisetty1 min read

'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్'లను పరిశీలించిన సీఎం

మాతా–శిశు సంక్షేమం కోసం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ వ

'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్'లను పరిశీలించిన సీఎం
మాతా–శిశు సంక్షేమం కోసం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు
Andhra Pradesh
Pregnant Women
Chandrababu Naidu
Mother Baby Express
Maternal Health
Newborn Care
నవజాత శిశువులు
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆసుపత్రులు
సంక్షేమ పథకం
Scroll for the next article