Politics4th Jun 11:27 AMSunil Byrisetty1 min read
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది.. సీఎం చంద్రబాబు ట్వీట్!
ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన
ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని పేర్కొన్నారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని తరిమికొట్టిన రోజు.. సైకో పాలనకు అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని వివరించారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు అని పేర్కొన్నారు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు.. కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని వ్యాఖ్యానించారు. "జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్- చంద్రబాబు".. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.