Politics21st Mar 09:59 AMSunil Byrisetty1 min read

చంద్రబాబు ఇంత నవ్వింది ఇప్పుడే!

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత

చంద్రబాబు ఇంత నవ్వింది ఇప్పుడే!
విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లను సైతం కడుపుబ్బ నవ్వించాయి. ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక పోటీల్లో ఎవరికి వారు పోటీపడి తమ ప్రదర్శనలను ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, స్పీకర్ లు అభినందించారు. ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అప్పట్లో ఎప్పుడూ ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ జరుగుతుండేవని, స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని దుర్యోధనుడి పాత్ర వేసి మొదటి ప్రైజ్ గెలుచుకున్నారన్నారు. అదే ఒరవడిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ క్రీడల్లో పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని కొనసాగించారన్నారు. తోడ్పాటు అందించిన మంత్రి పయ్యావుల కేశవ్, స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ రవి నాయుడు, సిబ్బందిని స్పీకర్ అభినందించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వందన సమర్పణ చేస్తూ తాను 28 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి క్రీడా స్ఫూర్తిని చూస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి ఇంతగా నవ్విన సందర్భం ఎప్పుడూ లేదన్నారు.
CM Chandrababu Pawankalyan Janasena
Assembly
మంత్రి రాంప్రసాద్ రెడ్డి
స్పోర్ట్స్ చైర్మన్ రవి నాయుడు
Scroll for the next article