News31st May 08:54 AMSunil Byrisetty1 min read

రండి.. పెట్టుబడులు పెట్టండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఢిల్లీ వేదికగా జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఆర్థికాభివృద్ధి - సుస్

రండి.. పెట్టుబడులు పెట్టండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఢిల్లీ వేదికగా జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఆర్థికాభివృద్ధి - సుస్థిరత - ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్ అనే అంశంపై సీఐఐ స్పెషల్ ప్లీనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇదే సందర్భంలో పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. రూపొందించిన విధానాలను సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047లో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుతున్నట్టు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ప్రస్తుతం సీబీఎన్ అనే బ్రాండ్ ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. క్రెడిబిలిటి అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఏపీకి రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. 2026 దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు అవుతుంది. దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి. డ్రోన్స్, ఐఓటీ, సెన్సార్లు ఇలా వివిధ రకాల సాంకేతికతతో రియల్ టైమ్ డేటా అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం ఈ రంగాల్లో పెట్టుబడిదారులు అవసరం. భవిష్యత్తులో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంది అని సీఎం చంద్రబాబు వివరించారు.
Andhra Pradesh news
Amaravati
cm Chandra Babu
invitation to investors
స్వర్ణాంధ్ర విజన్‌ -2047
రాష్ట్రాని చూసిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి
Scroll for the next article