Spiritual6th Oct 03:18 PMSunil Byrisetty1 min read
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వాన
శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ మేరకు ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. సీఎంకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవాలయ అధికారులు అందించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.