News1st Jun 09:14 AMSunil Byrisetty1 min read

చిన్నారుల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాట్రేనికోన మండలం చెయ్యేరు చిన్నారుల చిరు కోరిక తీర్చారు. ముమ్మిడివరం పర్యటనలో భాగంగా ప్రజావేదిక వద్ద అదే గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ము

చిన్నారుల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాట్రేనికోన మండలం చెయ్యేరు చిన్నారుల చిరు కోరిక తీర్చారు. ముమ్మిడివరం పర్యటనలో భాగంగా ప్రజావేదిక వద్ద అదే గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ముఖ్యమంత్రిని కలిశారు. తాము క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ కిట్ ఇప్పించవలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారులను ఆప్యాయంగా పలకరించి.. వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను చిన్నారులకు క్రికెట్ కిట్ అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ ద్వారా చిన్నారులకు క్రికెట్ కిట్ ను అందజేశారు. కిట్ అందుకున్న చిన్నారులు సంతోషంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Andhra Pradesh news
Cm Chandra Babu
konaseema
prajavedika
cricket kit
జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
చిన్నారుల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు
Scroll for the next article