News8th Nov 04:56 PMSunil Byrisetty1 min read

కుప్పంలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

కుప్పంలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. ఎస్ఐబీపీల ద్వారా పరిశ్రమలకు త్వరితగతి

కుప్పంలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన
కుప్పంలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. ఎస్ఐబీపీల ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం తెలుపుతున్నామన్నారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. డ్వాక్రా వ్యవస్థను ప్రారంభించామని, ఇప్పుడు ఆ వ్యవస్థ పెద్ద ఎత్తున ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించగలుగుతోందని వివరించారు. ఒకప్పుడు కుప్పం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పేర్కొన్నారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్క్ వచ్చాయన్నారు. ఒకే రోజు ఏడు సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. హిందాల్కో సంస్థ మొబైల్, ల్యాప్‌టాప్, టెక్ పరికరాల భాగాల తయారీలో ప్రసిద్ధి చెందిందని, ఇప్పుడు కుప్పంలో రూ.586 కోట్లు పెట్టుబడి పెడుతోందని సీఎం వివరించారు.
Andhra Pradesh
Kuppam
Chandrababu Naidu
Foundation Stone
Industrial Development
Hindalco
Investments
పరిశ్రమలు
ఆర్థిక వృద్ధి
డ్వాక్రా
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
ఎరో స్పేస్ సిటీ
Scroll for the next article